పోతిన్‌ రావు మృతికి ఎర్రబెల్లి సంతాపం

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): హబ్సిగూడలోని తన స్వగృహంలో మృతి చెందిన ఆల్‌ ఇండియా వెలమ సంఘం మ్యారేజ్‌ బ్యూరో చైర్మన్‌ తిరుపతి పోతన్‌ రావు భౌతికకాయం వద్ద పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. శ్రద్దాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ఎర్రబెల్లి సంతాపంతో ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.