పోలవరం టెండర్లపై విచారణ ఈ నెల 30కి వాయిదా

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై విచారణను హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. పోలవరం టెండర్లపై గతంలో ఇచ్చిన నిలుపుదల ఉత్తర్వులను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ లోగా ఒప్పందాలు చేసుకోవదని ప్రభుత్వానికి సూచించింది.