‘ పోలవరం ‘ పై ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్న నేతలు: పాల్వాయి

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కొంతమంది నేతలు, అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి. గోవర్థన్‌రెడ్డి అన్నారు. పర్యావరణానికి కీడు చేసే ప్రాజెక్టులు నిర్మించాలని ఎవరూ చెప్పరని, రాష్ట్రమే ఆలోచించుకోవాలని కేసీఆర్‌ చెప్పడం సబబు కాదని పాల్వాయి అన్నారు. ఉద్యమాన్ని కొనసాగిస్తూ చర్చలు జరిపితేనే తెలంగాణ సాథ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లో ఐక్యత, చైతన్యం లేకపోవడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తిరోగమనంలో ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా ప్యాకేజీలు, పదవులు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందరని ఆయన అన్నారు.