పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓటేసిన అభ్యర్థి

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్‌ ప్రారంభం కావడానికి పదినిమిషాలు ముందే ఓటేశారు.ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లగా కృష్ణదాసు ముందస్తు ఓటుపై జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరతామని భన్వర్‌ లాల్‌ తెలియజేశారు.