పోలీసులకు సహకరించాలి. ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్.

 

 

 

 

కోటగిరి మార్చి 11 జనం సాక్షి:-మండల ప్రజలు పూర్తి స్థాయిలో పోలీసులకు సహ కరించాలని ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శనివారం మండల కేంద్రంలోని పలు కూడలిలో వ్యాపార సము దాయాల యజమానులు, ప్రజలతో ఆయన సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సు ను నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ. నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకై ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పలువు రిని కోరారు.అందుకు గాను దాతల సహకారం కావాలన్నారు.అనుమానా స్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచ రిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఈ అవగాహన సదస్సులో కానిస్టేబుల్ సురేష్,జనార్దన్ రెడ్డి,వ్యాపార సముదాయాల యజమానులు,మండల ప్రజలు పాల్గొన్నారు.