పౌష్టికాహారంపై అవగాహన

నిజామాబాద్‌, జూలై 25 : స్థానిక సచివాలయంలో బుధవారం నాడు అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ బేబి మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో గర్భిణీలకు పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలకు సరైన పౌష్టికాహారంతోపాటు గుడ్లు, పాలు పంపిణీ చేయాలన్నారు. అంతకుముందు అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు లక్ష్మీ, బాలమణి, విజయ తదితరులు పాల్గొన్నారు.