ప్రకాశం బ్యారీజీ వద్ద ధర్నా చేసి తీరుతాం: దేవినేని ఉమ

విజయవాడ: ప్రభుత్వం ఎన్ని అడ్డుంకులు సృష్టించినా ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా చిసి తీరుతామని తెదేపా ఎమ్మెల్యే దేవినేని  ఉమ స్పష్టం చేశారు. రైతులు, తెదేపా నేతలను అడ్డుకొని ప్రభుత్వం ఏం సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. బ్యారేజీ వద్ద మహాధర్నాకు వస్తున్న నేతలను, రైతలను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. వైఎస్‌ హయాంలో కృష్ణా డెల్టా రైతులు దోపిడీకి గురయ్యారని మరో నేత గద్దె రామ్మోహన్‌రావు విమర్శించారు.