ప్రజల మనోభావాలను బాబు గుర్తించాలి: శైలజనాథ్‌

హైదరాబాద్‌: ఢిల్లీలో లాబీలు చేసేంత శక్తిమంతుడిని కానని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎవరు అడగకముందే తెలంగాణపై లేఖ ఇచ్చారన్నారు. ఎవరి ఆలోచనకు తోచిన విధంగా వారు అర్థం చేసుకొనేలా ఆ లేఖ ఉందని విమర్శించారు. ప్రజల మనోభావాలను బాబు గుర్తించాలని చెప్పారు. ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఆ లేక రాశారని వ్యాఖ్యానించారు. ప్రజలు బాబుకు దూరంగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు. లేఖ ద్వారా ఏకాభిప్రాయం వచ్చిందని అనుకోవడం లేదని శైలజానాథ్‌ చెప్పారు. బాబును చూసి భయపడే పరిస్థితి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ మంత్రులు కవాతు కోసం ప్రయత్నం చేయడంలో తప్పులేదన్నారు.