ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ తప్పనిసరి….

ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్రమేష్ బాబు..

చిలప్ చేడ్/25ఆగస్టు/జనంసాక్షి :- తమ బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా చిట్కుల్ ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ కొమ్ము రమేష్ బాబు అన్నారు మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన బోయిని సత్తయ్య అనే రైతు బ్యాంకులో ఖాతా ఉండి ఇన్సూరెన్స్ కట్టుకోవడం జరిగింది రైతుకు అనివార్య కారణాలవల్ల కరోనాసోకి మృతి చెందడం జరిగింది రైతు బ్యాంకులో ఇన్సూరెన్స్ కట్టుకోవడం వలన అతడి పేరు పైన 2లక్షల రూపాయల చెక్కు రావడం జరిగిందని అతడి భార్య అయినా  నామిని  బోయిని పద్మ కి గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు కావున మండలంలోని ప్రతి ఒక్క రైతు సోదరులు తమ బ్యాంకులో ఉన్న ఖాతాదారులు తప్పనిసరిగా వారి తమ పేరున ఇన్సూరెన్స్ చేయించుకోవాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి ఉపసర్పంచ్ సుధాకర్ బ్యాంకు సిబ్బంది సంగమేశ్వర్ సతీష్ హరీష్ మొగులయ్య అశోక్ బ్యాంకు మిత్ర సిబ్బంది వసంత లావణ్య నాగరాణి రామ్ రెడ్డి గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు