ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే పల్లె ప్రగతి

జహీరాబాద్ సెప్టెంబర్ 2( జనంసాక్షి) రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు.శుక్రవారం మొగుడం పల్లి మండలంలోని సజ్జరావుపెట్ తండా, జాంగర్బౌలి తండా, మిర్జంపల్లీ తండా, హరిచంద్ నాయక్ తండా, విత్తు నాయక్ తండా గ్రామాలలో కోటి 5 లక్షల రూపాయల ఎస్ డి ఎఫ్ ప్రత్యేక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అనంతరం అర్హులైన 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ధృవపత్రాలన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని 138 గ్రామాలకు 20 లక్షల చొప్పున 27.60 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు.
కార్యక్రమాల్లో జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డీ, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ డైరెక్టర్ కిషన్ పవర్, ఆత్మ డైరెక్టర్ పరుశురాం, సర్పంచులు శంకర్ నాయక్, రాంశెట్టీ, సీతా బాయ్ గోపాల్, ఘంసి బాయ్ లక్ష్మణ నాయక్, గంలి బాయ్ కిషన్ పవర్, ఎంపీటీసీ పూని బాయ్ జాదవ్ చందు, టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్, నారాయణ, కేశు నాయక్, జాదవ్, దశరథ్, లింబోజి వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు,
అధికారులు మరియు కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు