ప్రత్యేక వైద్య శిభిరాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

ధర్మారం మండలంలోని మేడారం పీహెచ్‌సీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ స్మితసబర్వాల్‌ ప్రారంబించారు. కరీంనగర్‌లోని ప్రతిమ యాజమాన్యంతో గతవారం క్రితం పర్యటన సందర్బంగా చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతిమ అసుపత్రి సహకారంతో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని 24 గంటల అస్పత్రులన్నింటిలో నెలకోరోజు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని కలెక్టర్‌ పెర్కోన్నారు.