ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం మరో నెలలపాటు పొడిగించిన మోడీ ప్రభుత్వం జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి
ముస్తాబాద్ సెప్టెంబర్ 29 జనం సాక్షి
పేదలకు మోదీ ప్రభుత్వం పండుగ కానుకగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచిత రేషన్ పంపిణీని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఇందుకు కేంద్రం మరో రూ.45వేల కోట్లు వెచ్చించనుంది. ఈ సందర్భంగా ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక పథకాలను తీసుకొచ్చిందని అందులో భాగంగా కరోనా కష్టకాలంలో తీసుకొచ్చిన ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించడం హర్ష దాయకమని ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి పేర్కొన్నారు.
Attachments area