ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి టాయిలెట్లు వారే శుభ్రంచేసుకోవాలి: విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చందనఖాన్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి టాయిలెట్లు వారే శుభ్రంచేసుకోవాలని వివాస్పద వాఖ్యలు  విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చందనఖాన్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేయాడానికి ఎవరు ముందుకు రావటం లేదు, మా దగ్గర నిధులు కూడా లేవని ఆమె అన్నారు. అన్ని పాఠశాలల్లో మరుగుదోడ్లు కేటాయించటం కుదరదని అన్నారు. ఫీజులు,పుస్తకాలు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఈ మరుగుదోడ్లు విద్యార్థులు శుభ్రంచేస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఈ వాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని సుఫ్రీం సూచనలకు విరుద్దము.