ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి:తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి- చిగురుమామిడి ఎస్సై డి.సుధాకర్
జనంసాక్షి /చిగురుమామిడి – సెప్టెంబర్ 3:
గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం చిగురుమామిడి పోలీస్స్టేషన్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటుచేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ వినాయక విగ్రహాన్ని జియో టాగింగ్ చేయడం జరిగింది అని గణేష్ ఉత్సవాలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ వారి సూచనలు పాటించి సహకరించాలన్నారు.గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి డీజే లకు అనుమతి లేదని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు విగుతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని యువతను కోరారు.ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఎస్సై చెప్పారు. పోలీసులు అన్ని గ్రామాల్లో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తారని మండపాలను సందర్శిస్తారని వారికి సహకరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో చిగురుమామిడి వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.