ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి యువకుడు
కృష్ణా, ఏప్రిల్ 1 : కృష్ణా జిల్లా పెడనలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికను లోబర్చుకున్న యువకుడు గర్భవతిని చేశాడు. తమ కుటుంబసభ్యుల అప్పును తాను చెల్లిస్తానంటూ తనను లోబర్చుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడు పరారీలో ఉన్నాడు. పెడన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.