ఫోటో రైటప్:మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజయ్య,

జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
… ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి
స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 29, ( జనం సాక్షి ) : తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ అభి వృద్ధి పథకాలు దేశానికి ఆదర్శం అని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘన త సీఎం కేసీఆర్ దేనని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొం డ రాజయ్య , జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఆసరా పెన్షన్లపంపిణీ కార్యక్రమంలో భాగం గా చిల్పుర్ మండలంలోని చిన్నపెండ్యాల బివైజి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసరా పెన్షన్లు  లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, టిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి  చేతుల మీదుగా మంజూరు కార్డ్స్ ఆసరా పెన్షన్ దారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథ కాలు అమలు చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కడుపు లో పెట్టుకుని చూసుకుంటున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో అద నంగా మరో10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు మం జూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ స్వర్ణ యుగం నడుస్తోందనిఅన్నారు.చిల్పుర్ మండలంలో ఇప్ప టి వరకు  పెన్షన్లు ఉండగా, నూతనంగా మరో 13 20  పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధి కారులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.