ఫోటో రైట్ అప్: వృద్ధురాలి కాళ్లు నొక్కుతున్న కాంగ్రెస్ నేత ఏపూరి సతీష్
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇంటింటి ప్రచారంలో కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు
సంస్థాన్ నారాయణపురం (జనం సాక్షి):
బిజెపిని టిఆర్ఎస్ పార్టీలను ఓడించి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ప్రజల కాళ్ళు మొక్కారు.మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదంతో టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం నాడు కాంగ్రెస్ నాయకులు గుడిమల్కాపురం, శిమిర్యాల గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం గ్రామంలో ఒక వృద్ధురాలని కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏపూరి సతీష్ కాళ్లు పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల ఇన్చార్జిలు గండ్ర సత్యనారాయణ, బలరాం నాయక్, పాల్ పాల్వాయి స్రవంతి లు పాల్గొన్న ఈ ఇంటింటి ప్రచారంలో వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో ఆందోళనకర పరిణామాలు జరుగుతున్నా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బిజెపి , టీఆర్ఎస్ పార్టీలు హత్య చేస్తున్నాయని ధ్వజమెత్తారు . దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ ప్రజల కోసం ఎన్నో త్యాగాలను చేసిందని కొనియాడారు. స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పునర్నిర్మించిందని తెలిపారు. బ్రిటిష్ పాలకుల వల్ల దేశం అనేక రకాలుగా నష్టపోయిందని దానిని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. అనేక పోరాటాల అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బిజెపి టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ నేతలను భయపెట్టి కేసుల బూచి చూపించి డబ్బులకు మరికొందరిని కొనుగోలు చేస్తూ నష్టపరుస్తున్నాయని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గం లో ఉప ఎన్నిక లకు బిజెపి నే కారణం అని విమర్శించారు. బిజెపి టిఆర్ఎస్ లో దోచుకున్న డబ్బుతో మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో బిజెపి టీఆర్ఎస్ ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. మండల కేంద్రంలో40 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ReplyForward
|