బంజార శక్తి సేన రాష్ట్ర ఛీఫ్ కోఆర్డినేటర్ గా చందు రాథోడ్
జుక్కల్ ,సెప్టెంబర్3,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కోమటిచెరు తండా ఉపసర్పంచ్,తెలంగాణా రాష్ట్ర ఉపసర్పంచ్ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు రాథోడ్ బంజార శక్తి మూవ్మెంట్ లో ప్రధాన విభాగం అయిన బంజారా శక్తిసేనకు తెలంగాణా రాష్ట్ర ఛీఫ్ కోఆర్డినేటర్ గా శనివారం నియమితులయ్యారు.తన పై నమ్మకంతో ఈ పదవి అప్పజెప్పిన బంజార శక్తి మూవ్మెంట్ ఫౌండర్,ప్రెసిడెంట్ ఎం. సంతోష్ కు చందు రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవితో తనపై మరింత భారం పెరిగిందని ఆయన అన్నారు.బంజారాలకు సేవకు తన జీవితం అంకితం చేస్తానని ఆయన అన్నారు. చందు రాథోడ్ కు ఈ పదవి రావడంతో కామారెడ్డి జిల్లా బంజారాలు సంతోషం వ్యక్తం చేశారు.