బజాజ్‌ అలియాంజ్‌ ఉద్యోగుల రక్తదానం

రక్తదానం చేస్తున్న బజాజ్‌ అలియాంజ్‌ ఉద్యోగులు

కరీంనగర్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : తలసిమియా వ్యాధిగ్రస్తుల కోసం శుక్రవారం స్థానిక రాజీవ్‌ చౌక్‌లో బజాజ్‌ అలియాంజ్‌ ఇన్సూరెన్స్‌ కం పెనీ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ నెల  5 నుంచి 12 వరకు అంకు రం అనే పేరుతో ఈ రక్తదాన శిబిరా న్ని రాష్ట్రవ్యాప్తంగా 55 పట్టణాల్లో నిర్వహిస్తున్నట్టు సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ కేఎం లాల్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై న జిల్లా వైద్యఆరోగ్య శాఖాధి కారి డాక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రక్తదానం శిబిరాన్ని బజాజ్‌ అలి యాంజ్‌ సంస్థ చేపట్టడం అభినందనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సంస్థ డాక్టర్‌ ఎంఎల్‌ఎన్‌ రెడ్డి, ఆపరేషన్స్‌ మేనేజర్‌ ప్రియ, సీనియర్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్లు తోట అంజనీప్రసాద్‌, సి.వేణుకుమార్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.