బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి

వినుకొండ, జూన్‌ 28 : ఆరు నుండి 14 సంవత్సరాల బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కేజిబివి ప్రత్యేక అధికారి సుబ్బారావు గురువారం కోరారు. ఆయన మాట్లాడుతూ గిరిజన తండాల్లోని పిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చైతన్యయాత్రలో భాగంగా కళాజాత బృందం ప్రదర్శనలు జరిపింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గిరిజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.