బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన జోనల్ కమిషనర్ మమత

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 30
అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సతీమణి వాణి హాజరై మున్సిపల్ కార్యాలయం ముందు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని జరిగింది. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచి విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూఅనుబంధాలను గుర్తుచేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుంది. బతుకమ్మ పండుగను అద్భుతమైన పూల ఉత్సవంగా ప్రకృతిని పూజించే పండుగగా జరుపుకుంటారు.తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని మమత కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి, టౌన్ ప్లానింగ్ అధికారి విజయశ్రీ, స్థానిక కార్పోరేటర్ లు చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్, మున్సిపల్ అధికారులు డి ఈ ప్రశాంతి, ఏ ఈ లక్ష్మి, మహిళా మండలి అధ్యక్షురాలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area