బదిలీపై వెళ్ళిన కానిస్టేబుళ్ళకు ఘనసన్మానం

హుజురాబాద్‌ మే 27 (జనంసాక్షి):
పోలీస్‌స్టేషన్‌లో గత ఆరు సంవత్సరాల నుండి కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న బాస్కర్‌రెడ్డి, శంకరయ్య, వేణుగోపాల్‌, బుచ్చినాయుడు, బదిలీ కావడంతో ఆదివారం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో డిఎస్‌పి నాగలక్ష్మి టౌన్‌సిఐ శ్రీనివాస్‌ ఆద్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ అభయ్‌నా యక్‌, కానిస్టేబుల్‌ మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమేష్‌, కాజా, నారాయణ, రమేష్‌, తదితరులుపాల్గొన్నారు.