బద్దిపడగ శివారులో యువకుడి దారుణహత్య
సిద్దిపేట,అక్టోబర్30 (జనంసాక్షి) : జిల్లాలోని నంగునూర్ మండలంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నంగునూరు మండలంలోని బద్దిపడగ శివారులో యువకుడిని గుర్తతెలియని వ్యక్తులు హత్యచేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని కోహెడ మండలం తంగళ్లపల్లికి చెందిన రాజశేఖర్ (28)గా గుర్తించారు. తెల్లవారుజామున హత్య జరిగినట్లు భావిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.