బద్య తండ లో కంటి వెలుగు కార్యక్రమం


రఘునాథ పాలెం ఫిబ్రవరి 24(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖమంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు బద్యతండ గ్రామపంచాయతీ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల జడ్పిటిసి మాలోతు ప్రియాంక ప్రారంభించారు. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని పేద గిరిజన ప్రజలైనటువంటి మనము అందరము ఉపయోగించుకోవాలని ముందుచూపుతో కంటి పరీక్షలు చేయించి జాగ్రత్త వహించి మెరుగైన ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచు భూఖ్య సుగుణ .ఉపసర్పంచ్ నునావతు గౌస్ నాయక్ నాయకులు భుఖ్య దేవా మాలోతు ప్రసాద్ . శ్రీను మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు