బలంగా మారిన నైరుతి రుతుపవనాలు
విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో బలంగా మారాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45నుంచి 50కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముందంలోకి వెళ్లే మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.