బళ్లారిలో ట్రాన్స్‌పోర్టు, ట్రేడర్స్‌ కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు

బళ్లారి: బెళెకెరి ఓడరేవులో ఖనిజం అక్రమ ఎగుమతుల కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు సోమవారం బళ్లారి నగరంలోని వివిధ ట్రాన్స్‌పోర్టు, ట్రేడర్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లు సమాచారం. సోమవారం ఉదయం అధికారులు రెండు వాహనాల్లో బళ్లారికి చేరుకొని నగరంలోని పటేల్‌నగర్‌, అనంతపురం రహరాదిలోని ట్రాన్స్‌పోఉ్ట, ట్రేడర్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.