బాబును నమ్మని తెలంగాణ ప్రజలు : పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒక్కసారైనా ‘ జై తెలంగాణ ‘ అనాలని తెరాసా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తెరాస రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడిమాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న పాదయాత్ర ప్రజల ఇష్టం మేరకు జరగటం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్మటం లేదని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 2014లో అధికారం కోసమే బాబు ఈ పాదయాత్ర చేస్తున్నారని, తెరాస మాత్రం తెలంగాణ రాష్ట్ర సాథన కోసం మాత్రమే పని చేస్తుందని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా  పని చేసే తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైకాపాలకు తెరాస వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, చందూలాల్‌ పాల్గొన్నారు.