బాలానగర్‌ లో చిన్నారికి అమ్మ కోసం అన్వేషణ

బాలా నగర్‌: జిల్లా కేంద్రం లోని సాయిశ్ర్రీ ఆసుపత్రిలో ఇటీవల విక్రయానికి పెట్టిన చిన్నారికి సంబంధించిన వివరాల కోసం క్రైం బ్రాంచ్‌ పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. శుక్రవారం బాలనగర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలతో క్రైం బ్రాంచ్‌ ఎస్సై వెంకటగిరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని బాలింతలు, గర్భిణీల వివరాలను ఆయన సేకరించినట్లు సీడీపీవో లక్ష్మమ్మ తెలిపారు.