బాలిక గొంతు కోసిన ఉన్మాది

విజయవాడ, జూలై 28 : సింగ్‌నగర్‌లో ఓ ఉన్మాది బీభత్సం సృష్టించాడు. శనివారం తెల్లవారుజామున ఒక ఇంట్లోకి దూరి ఒంటరిగా ఉన్న ఓ బాలిక గొంతు కోసి పరారైనాడు. స్థానికులు గమనించి వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానిక డాబా సెంటర్‌లో నివసించే రామకృష్ణరావు అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఓ వివాహానికి హజరైందుకు వెళ్ళాడు. కాగా స్కూలు ఉండటంతో అతని కుమార్తె సునీత ఇంటిలోనే ఉంది. శనివారం తెల్లవారు జామున సునీత చదువుకుంటుండగా, ఒక వ్యక్తి ఇంటిలోకి దూరాడు. కత్తితో ఆమె గొంతు పోడిచి పరారైనాడు. ఆమె పెట్టిన ఆరుపులకు ఇరుగుపొరుగువారు వచ్చి అగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రయోజనం లేకపోయింది. సునీత పరిస్థితి ప్రమాదంకరంగా ఉంది. ఆ ఉన్మాది ఎవ్వరన్నది ఇక్కడ చర్చనీయాంశమైంది. సైకో సాంబ మళ్ళీ నగరంలోకి ప్రవేశించాడా అన్నా అనుమానాలు తలెత్తుతున్నాయి.