బిఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్ మే 16(జనం సాక్షి )

రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త బ్యాగరీ శివ అకస్మాత్తుగా మృతి చెందగా గురువారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విషయం తెలుసుకొని శివ అంతక్రియల్లో పాల్గొన్నారు. పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి పాడే మోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వయసులో శివ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.బిఆర్ఎస్ పార్టీ పరంగా కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారితోపాటు రాయపోల్ జెడ్పిటిసి లింగయపల్లి యాదగిరి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేష్ శర్మ, బిఆర్ఎస్ నాయకులు నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు.