బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం


జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ మార్చి 29
పెంట్లవెల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన పార్టీ శ్రేణులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నేడు కొల్లాపూర్ నియోజకవర్గం అన్ని మండలాలలో,గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం జరుగుతుందని,వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు,రైతులకు రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు, కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు వంటి నగదు బదిలీ పథకాలతో పాటు సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, స్మశాన వాటికలు, మన ఊరు మనబడి పెంట్లవెల్లి మండలంలో పాఠశాలలను మౌలిక వసతులు కల్పిస్తూ ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.పెంట్లవెల్లి మల్లేశ్వరం బ్రిడ్జి పూర్తి చేసుకున్నామని,పెంట్లవెల్లి మండలానికి మండల కాంప్లెక్స్ భవనాన్ని మంజూరు చేసుకున్నామని.ఎన్నో ఏళ్లుగా మరుగున పడేసిన నమాజ్ కట్ట వెడల్పు పనులు నేడు జరుగుతున్నాయని అన్నారు గోపాలపురం రైతులు కాలువ లైనింగ్ చేయాలని కోరగా సాధ్యమైనంత తొందరగా లైనింగ్ పనులు చేసి రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.అన్ని విధాలుగా రైతులకు అండగా నిలిచి గతంలో వ్యవసాయం అంటే దండగ అనే కాడి నుంచి వ్యవసాయం అంటే పండగ అని రూపించిన కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు పుట్టిన బిడ్డ నుంచి చావుకు వృద్ధుల వరకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, దళారి వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు.ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం సీఎం కేసీఆర్ గారు దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళితుల ఆత్మ గౌరవంగా బతకాలని అన్ని వర్గాలతో సమానంగా ఆత్మగౌరవంతో జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.కార్యకర్తలే నా బలం,సీఎం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే అన్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే తో పాటు, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.