బీజేపి మందమర్రి అధ్యక్షులు పైడిమల్ల అక్రమ అరెస్ట్
.బీజేపి మందమర్రి అధ్యక్షులు పైడిమల్ల అక్రమ అరెస్ట్……..రాష్ట్రంలో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉందని విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. అని రాష్ట్ర ప్రభుత్వమ్ ప్రజా పరిపాలనలో శాంతి భద్రతలో అన్ని విషయాల్లో విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు ప్రతి ఒక్క బీజేపి నాయకులు కార్యకర్తలు రాజీ లేని పోరాటాలు చేస్తున్నందున మళ్లీ పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుందని విద్యాశాఖ మంత్రి వైఫల్యం ఉందని విద్యార్థుల ప్రజల దృష్టిలో దోషులమవుతామని భయపడి అర్ధరాత్రి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని ఇంట్లో చొరబడి అక్రమ అరెస్టు చేయడం. మందమరి మండలంలో బిజెపి నాయకులు ప్రభుత్వ . పోలీస్ వైఖరికి నిరసనగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తారని ఇండ్లలో చొరబడి అక్రమంగా సీనియర్ నాయకులు డివి దీక్షితులు. మందమరి మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ . పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్ . యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు సురేందర్. పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్. నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని . గత పది రోజుల క్రితం టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బిజెపి నాయకులను కార్యకర్తలు అక్రమం గారు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించడం మళ్లీ ఈ రోజు అక్రమంగా అరెస్టు చేయడం విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తీవ్రంగా ఖండిస్తు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.