బీడ్‌లో నలుగుర్ని బందించిన ఎన్‌ఐఏ

బీడ్‌: మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో నలుగుర్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి బీడ్‌లో ఎన్‌ఐఏ, మహారాష్ట్ర ఏటీఎన్‌ పోలీసులు సోదాలు జరిపి., యునానీ వైద్యుడు రెహన్‌ షేక్‌, వాసిం ఛిస్తీ, జకీయుద్దీన్‌ నిజాముద్దీన్‌, మరో వ్యక్తిని నిర్భందించినట్లు తెలిపారు. నాలుగు కంప్యూటర్లు, ఓ ప్రింటర్‌ కొన్ని సీడీలు, మ్యాప్‌లను రెహన్‌షేక్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించి నిందితులను ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన పుణె పేలుళ్లకు సంబంధించా లేక 26/11 దాడుల కేసులోనా అని అడిగిన ప్రశ్నకు బీడ్‌ ఎస్సీ దత్తాత్రేయ్‌ మాండ్లిక్‌ స్పందిస్తూ ఉగ్రవాద కేసులకు సంబంధించి ఎన్‌ఐఏ తరచూ నిర్వహించే సోదాల్లో భాగామే ఈ చర్య ప్రజలు ఎలాంటి ఆందోళనలకు లోనవ్వొద్దు అని బదులిచ్చారు.