బోధనోపకరణాలను ఉపయోగించి బోధించాలి
బోధనోపకరణాలను ఉపయోగించి బోధించాలి..
నోడల్ అధికారి రాజిరెడ్డి..
శంకరపట్నం: జనం సాక్షి జనవరి 4
శంకరపట్నం మండల కేంద్రంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేశవపట్నంలో గత రెండు రోజులుగా జరుగుతున్న మండల స్థాయి టి.యల్.యం.బోధనాభ్యసన సామగ్రి, మేళా ముగింపు సమావేశం బుధవారం మండల నోడల్ అధికారి వైద్యుల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యుల రాజిరెడ్డి మాట్లాడారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థులు, విషయాన్ని త్వరగా అవగాహన చేసుకోవడమే కాకుండ, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను పెంపొందించ వచ్చునని, స్థానికంగా ఉచితంగా దొరికే వస్తువులను ఉపయోగించి, టి. యల్. యం. తయారు చేయాలని సూచించారు.బోధనాసామగ్రి బహుళ తరగతికి ఉపయోగపడే విధంగా ఉండేలా చూడాలని తెలిపారు. మండలంలోని 32 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు తయారు చేసిన
టి.యల్.యం. ను ప్రదర్శించడం జరిగింది. పేర్కొన్నారు.ఇట్టి మేళాను అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు సందర్శించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ నోడల్ అధికారులు టి రోజారాణి, ఏ.మమత గౌతమి, ఎస్. ఆనందం, రిసోర్స్ పర్సన్స్ కె శ్రీలత, వై కొండాల్ రెడ్డి, టి భూపతి, యల్ కోటేశ్వర్ రావు, టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



