బోన్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న యువతి-దాతల సహాయం కోసం ఎదురు చూపులు

కరీంనగర్‌: జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రంకు చెందిన ముస్లీం మైనార్టి నిరుపేద కుటుంబంలోని అమ్మాయి ఎండి.రేష్మా బోన్‌ కాన్సరుతో పోరాడుతుంది. రేష్మా 2011 ఆగష్టు మొదటి వారంలో అనారోగ్యానికి గురవటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్‌లోని నిజాం ఆర్థోపిడిక్స్‌ హాస్పిటల్‌కు చపించవలసిందిగా సూచించారు. దీంతో నిజాం ఆర్థోపిడిక్స్‌ హాస్పిటల్‌లో పరిక్షలు నిర్వహించగా పరీక్షల్లో బోన్‌ క్యాన్సర్‌ అని తేలింది. కాలు తీసి వేయాలని డాక్టర్లు చెప్పారు. రేష్మా వయస్సు 19సంవత్సరాలు నుక తల్లీదండ్రులు ఆవేదన చెంది బాధతో తిరిగి ధర్మపురికి చేరారు. ఈ బాధ తట్టుకోలేని తండ్రి లాల్‌మహ్మద్‌ మృతి చెందాడు. బాబాయి, బంధువులు రేష్మాను ముంబాయిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి ప్రముఖ డాక్టర్‌కు చూపించగా దేశంలో అత్యంత ఆధునికమైన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం గల టాటా మెమోరియల్‌ ఆసుపత్రిలో చూపించాల్పిందిగా చెప్పారు. ప్రస్తుతం టాటా మెమోరియల్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతుంది. మహానగరమైన ముంబాయిలో దినసరి ఖర్చులు, మెడిసిన్‌ ఖర్చులు భారమై పోతున్నాయని దాతల అపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నామని ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని రేష్మా తల్లీ, బంధువులు కోరుతున్నారు. సహాయం చేసే దాతలు ఈ నెంబరును 9849523629 సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.