బ్యాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యంలో ఆందోళన

విశాఖ : బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం మన్యం బంద్‌కు పిలుపునిచ్చింది. బాక్సైట్‌ ఒప్పందాలను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని పాడేరు ఐటీడీఏ వద్ద అఖిలపక్ష నేతలు నినాదాలు చేశారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నేడు సీఎం పాడేరు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. పలువురు అఖిలపక్ష నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.