బ్రాహ్మణ నిత్యాన్న సత్రం అధ్యక్షుడుగా సుధాకర్‌రావు

వేములవాడ, జూన్‌-17, (జనంసాక్షి):
పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే బ్రాహ్మణుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రం ఎన్నికలను ఆదివారం రోజున సత్రం ఆవరణలో నిర్వహించారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయులు వాసాలమర్రి విఠల్‌తో పాటు దేవరాజు మహేందర్‌ అధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలలో సత్రం గౌరవాధ్యక్షులుగా ప్రతాప రామకృష్ణ, అధ్యక్షులుగా గుండర్సు సుధాకరావు, ఉపాధ్యక్షులుగా మామిడిపెల్లి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా బుడెంగారి మహేశ్‌, కోశాధికారిగా కేశన్నగారి కృపాల్‌, సంయుక్త కార్యదర్శిగా దేవరాజు నర్సయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కొత్తపెల్లి రాజేందర్‌, నమిలకొండ (గుమ్మి) పవన్‌, పారువెళ్ళ శ్రీనివాస్‌, గోపన్నగారి శ్రీనివాస్‌, పురాణం రాము, చర్లపెల్లి భానులను కార్యవర్గసభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే సత్రం కో-ఆప్షన్‌ సభ్యులుగా కొత్తపెల్లి విజయ్‌, గోపన్నగారి శ్రీకాంత్‌లు, ఆడిట్‌ & ఆర్థిక సలహాదారునిగా మామిడిపెల్లి కృష్ణమూర్తిలను నియమిస్తూ సత్రం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.