భక్తిశ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థించాలి.
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 3(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శుక్రవారం రాత్రి భజనసమాప్తి
ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మంబాపూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భజనలు పాల్గొని భక్తి పాటలు ఆలపించారు . ఈసందర్భంగా భజనమండలి సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమ మంలో గ్రామసర్పంచ్ రేగొండి శ్రవణ్ కుమార్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, వరప్రసాద్ గౌడ్, విజయకుమార్, జుంటుపల్లి నర్సిములు, చాకలి అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు