భారత్- ఖతార్‌ల మధ్య 7 కీలక ఒప్పందాలు
ఖతార్,జూన్ 5(జనంసాక్షి):భారత్-ఖతర్ మధ్య 7 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఖతర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఎమిర్ షేక్ తవిూమ్ బిన్ తో సమావేశమయ్యారు.
అనంతరం ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు సంతకాలు చేశారు. ఇందులో పర్యాటక రంగం అభివృద్ధి, స్కిల్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారం వంటి ఒప్పందాలు ఉన్నాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం గల్ఫ్ దేశం ఖతార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా
దోహాలో ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ప్రధాని.. భారత్‌లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలున్నాయని వెల్లడించారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి
ఉన్న అవరోధాలను తొలగిస్తామని ఈ సందర్భంగా వారికి హావిూ ఇచ్చారు.భారత్‌లో రైల్వేలు, సోలార్ ఎనర్జీ, వ్యవసాయోత్పత్తుల శుద్ధి వంటి రంగాల్లో ఖతార్ పారిశ్రామికవేత్తలకు
అపారమైన అవకాశాలున్నాయని మోదీ వెల్లడించారు. భారత్‌లోని 600 మిలియన్లకు పైగా ఉన్న యువత దేశానికి ప్రధాన బలమన్నారు. దేశంలో స్మార్ట్ సిటీ, మెట్రోస్ అండ్
అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు.
భారతీయులకు కష్టపడటం బాగా తెలుసు:మోడీ
దోహా: భారతీయులకు కష్టపడటం బాగా తెలుసునని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఖతార్ పర్యటనలో భాగంగా ప్రధాని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు ఆకర్షణ, మక్కువ పెరుగుతోందన్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా ఆర్థిక పురోగాభివృద్ధిని సాధిస్తోందన్నారు. భారత్ 7.9 శాతం వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధివైపు పరుగులు పెడుతోందని తెలిపారు.పలు దేశాలు ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయిని..అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక మందగమనంతో బెంబేలెత్తాయన్నారు. గతంలో రాష్ట్రాలకు 35 శాతం వాటా ఉంటే, కేంద్రానికి 65శాతం ఉండేది. ప్రస్తుతం రాష్ట్రాలకు 65 శాతం వాటా ఉంటే కేంద్రానికి 35 శాతం వాటా మాత్రమే ఉందని తెలిపారు. ప్రభుత్వంపై వేల కోట్లు భారత పడినా వాటిని లెక్కచేయకుండా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.