భారత్‌ చైనా స్నేహం కొనసాగుతుంది : జింటావో

న్యూఢిల్లీ, జూన్‌ 7 (జనంసాక్షి )

భారత్‌ చైనా స్నేహం కొనసాగుతుంది : జింటావో

గురువారం కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణతో భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా వారి మధ్య ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగించే విషయంలో చర్చ జరిగింది. ఇరు దేశాల మధ్య కొన్ని విషయాల్లో పొడసూపిన విబేధాలను తొలగించుకునే దిశగా వీరి మధ్య చర్చలు సాగాయి. మిగతా సమస్యలతో పోల్చిచూస్తే ఈ సమస్యలు చాలా చిన్నవేనని అభిప్రాయపడుతూ వాటిని అధిగమించాలని, ఇరుదేశాల మధ్య మైత్రీ బంధాన్ని మరింత పటిష్టం చేయాలని చర్చ సాగినట్టు తెలుస్తోంది.