భాస్కర్ నగర్ ఎస్టి కాలనీలో కొలువైన గణనాథుడు.
వల్లెపు బొబ్బిలి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ…
బూర్గంపహాడ్ సెప్టెంబరు 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల సారపాక భాస్కర్ నగర్ యస్ టి కాలనీలో వల్లిపు బొబ్బిలి ఆధ్వర్యంలో కొలువైన గణనాథుడికి భక్తులు వినాయక చవితి మొదలు ఈరోజు వరకు గణనాథుడికి విశేష పూజలు, ధూప, దీప నైవేద్యాలు అందించి భక్తులు పారవస్యం పొందారు. అశేష భక్తులతో విశేష పూజలు అందుకున్న లంబోధరున్ని వివిధ పూలు, పండ్లు,21 రకముల పత్రులతో ప్రత్యేకంగా అలంకరించి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు తమపై ఉండాలని వేడుకున్నామన్నారు. ఏ పూజ నిర్వహించాలన్న ముందుగా గణపతి పూజ తోనే మొదలు పెడతారనీ, పండుగలలో వచ్చే పండుగ మొదటి పండుగ వినాయక చవితి పండుగ, అందుకే ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే బుధవారం వల్లేపు బొబ్బిలి ఆధ్వర్యంలో పంచాయతీ ఈ ఓ మహేష్ చేతుల మీదుగా స్వామివారి మండపం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.