భువనగిరి ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు

share on facebook

గుర్తించి పెరికి వేసిన ఎకసైజ్‌ అధికారులు
భువనగిరి,ఆగస్టు17(జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానా మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతో పాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తించినట్లు భువనగిరి ఎక్సైజ్‌ సీఐ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఏరియా దవాఖానకు సోమవారం సాయంత్రం చికిత్స నిమిత్తం వచ్చిన వ్యక్తులు మార్చురీ సవిూపంలోని మొక్కల్లో గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించి అధికారులకు తెలిపారని అన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌ సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే నాలుగు మొక్కలు బయట చెత్త కుప్పలో పడేసి ఉండడాన్ని గుర్తించామన్నారు.
ఇవి రెండు నెలల వయస్సు మొక్కలని, ఎవరూ పెట్టినవి కావని, దవాఖానకు వచ్చిన వారు గంజాయి పీల్చి ప్యాకెట్లను పారవేయగా అందులోని గింజలు వర్షానికి మొలకెత్తి ఉంటాయన్నారు. అవి ఇంకా చిన్న మొక్కలని, వాటికి గింజలు రాలేదని, సాధారణంగా గంజాయి మొక్కలు 7నుంచి 8నెలల్లో పక్వానికి వస్తాయని, ఇవి కేవలం చిన్న మొక్క లేనన్నారు. అనంతరం దవాఖానా పరిసరాలను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించామని ఎలాంటి గంజాయి మొక్కలు కనిపిం చలేదని, చెత్త కుప్పలో పడేసిన నాలుగు మొక్కలే దొరికాయని, వాటికి పంచనామా నిర్వహించి కాల్చివేస్తామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా దవాఖానకు వచ్చేవారిపై నిఘా ఉంచాలని చెప్పారని, ఎక్కడైనా గం జాయి మొక్కలు అన్నట్లుగా అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారన్నారు. కాగా దవాఖాన ఆవరణ లో గంజాయి మొక్కలు ఎలా వచ్చాయో విచారణ జరుపుతామని ఈ విషయంపై దవాఖాన శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌ తెలిపారు.

Other News

Comments are closed.