భ్రష్టుపట్టినరాష్ట్ర రాజకీయాలు :బాబు నిర్వేదం

కరీంనగర్‌ 13, జూన్‌ (జనంసాక్షి) :
తెంలగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి బుధవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని సర్వోదయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ బోయినపల్లి వెంకటరామారావు ప్రారంభించారు.తొలి సంతకాలు చేసిన వారిలో బోయినపల్లితోపాటు టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ హామీద్‌ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికై ఈ సంతకాల సేకరణ చేపట్టనట్లు జేఏసీ ఛైర్మన్‌ జి.ఎస్‌ ఆనంద్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై అందరు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస్‌, నగర కన్వీనర్‌ లింగంపల్లి సత్యనారాయణ, అధికార ప్రతినిధులు నారాయణగౌడ్‌, సతీష్‌గౌడ్‌, రాకేష్‌, పాదాచారి, సీపీఐ సంఘం జిల్లా ఇన్‌చార్జీ కెసిపెట్టి శ్రీధర్‌గౌడ్‌, తిరుపతిరావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు