మండపం నుంచి వినాయకుడి ప్రతిమ అపహరణ.
రాజన్నసిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్1.(జనం సాక్షి).విఘ్నాలను తొలగించే వినాయకుడికే రక్షణ కరువైంది. అందరిని చల్లగా చూసే వినయకుడికుడి పై దొంగల కన్ను పడింది.ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి వినాయకుడి విగ్రహాన్ని అపహరించుకు పోయారు.గురువారం ఉదయం అపహరణ విషయం వెలుగు చూసింది..సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్ లో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి నీ అనుకుకుని చిన్న పిల్లలు బుధవారం వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.సంబరాల్లో మునిగిపోయారు. అనూహ్యంగా గురువారం ఉదయం చూసేసరికి వినాయక ప్రతిమ కనిపించక పోయేసరికి చోరీ జరిగిందని గుర్తించిన పిల్లలా తల్లిదండ్రులు సమీపంలోని సి సి కెమెరాలకు పరిశీలించారు.అర్ధరాత్రి 1.50.నిముషాల సమయంలో ద్విచక్ర వాహనం పై వచ్చిన విననాయకుడి ప్రతిమ ను ఎత్తుకెళ్లి నట్టురికార్డు అయ్యింది మళ్లీ మరో చిన్న వినాయకుడు ప్రతిను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.వినాయకుడి ప్రతిమ చోరీ విషయం పట్టణం లో చర్చనీయాంశం గా మారింది.