మంత్రి పదవికి ధర్మాన రాజీనామా

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి):
జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ ఐదో నిందితునిగా దర్మాన పై అభియోగాలు చేసిన నేపథ్యంలో మంగళ వారం రాత్రి ధర్మాన రాజీనామా చేశారు. ఢిల్లీ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన ధర్మాన హైడ్రామా మధ్య రాత్రి పదకొం డున్నరకు సీఎంకు రాజీనామా ను సమర్పిం చారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో హైద్రాబాద్‌కు వచ్చిన ధర్మాన ఎయిర్‌పోర్టులోనే సహచర మంత్రి గంటా శ్రీనివాస్‌ రావును కలిసి గంటపాటు చర్చించారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో తన ప్రారంభించన దృష్ట్యా రాజీనామా చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకిస్తుందన్న భయంతో చివరికి థర్మాన రాజీనామాకే మొగ్గుచూపారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు నుండి నేరుగా క్యాంపు కార్యలయానికి వెళ్లి లేఖను సమర్పించారు. అయితే ఇపురాజీనామా చేయవద్దని సీఎం వారించనప్పటికీ ఆయన వినకుండా రాజీనామా కు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో గత రెండు రోజులుగా రాజీనామా చేస్తాడా లేదా అన్న సందిగ్దతకు తెరపడింది. రాజీనామా చేసిన అనంతరం ఆయన విలేకర్లుతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ లో కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి ఈ రోజు ఈ స్థాయికి చేరడం వెనక పార్టీ అండదండలు ఉన్నాయ న్నారు. సీఎంకు లేఖ సమర్పించడం సంప్రదాయం అని తాను దాన్నే పాటించానని తెలిపారు. వాన్‌పిక్‌ వ్యవహారంలో తనపై సీబీఐ అభియోగం నేపథ్యంలో రాజీనామా చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, కోర్టులో తనపై వచ్చిన ఆరోపణలు వీగిపోతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రిగా ఏ అవినీతి కి పాల్పడలేదని, కోర్టులో తన నిజాయితీని నిరూపించుకొని బయటకు వస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్దంతాల పట్ల, అంకిత భావం పట్ల నమ్మకం ఉందని అందుకే రాజీనామా చేశానని తెలిపారు. సీఎం రాజీనామా ఆమోదించడానికి కొంత సమయం పడుతుందన్నారు.