మట్టి రోడ్లకు మహర్దశ
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బోయినిపల్లి గ్రామాలలో పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
డప్పుచప్పుళ్ళతో ఘనస్వాగతం పలికిన ఆయా గ్రామాల ప్రజలు.
బోయినిపల్లి మార్చ్ 14 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని స్థంభంపల్లి,గుండన్నపల్లి,విలాసాగర్ గ్రామాలలో 48 లక్షల 20వేల రూపాయల ఇజిఎస్ నిధులతో నూతన సిసి రోడ్డు ప్రారంభోత్సవ పనుకు విచ్చేసిన ఎమ్మెల్యే రవిశంకర్ కు ఆయా గ్రామాల ప్రజలు డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం స్థానిక నాయకులతో కలసి వచ్చింది.
ఈ సదర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లకు బిఆర్ఎస్ హాయంలోనే మహర్దశ వచ్చిందని, బోయినిపల్లి మండలంలో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో వాడ వాడ న సి సి రోడ్లు వేయాలని అన్నారు.
2014 తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
చొప్పదండి నియోజకవర్గం ప్రగతిపథంలో ముందుందని ఈ సంద్భంగ ఏం ఎల్ ఎ సుంకె రవిశంకర్ అన్నారు.