మద్యం అమ్మకాలపై నియంత్రణ

నవంబర్‌30తో ముగియనున్న కాంట్రాక్ట్‌
స్టాక్‌ పెట్టేందుకు షాపు యజమానుల విముఖత
నాగర్‌కర్నూల్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : ఎన్నికల సమయం కావడం..మద్యం అమ్మకాలపై నియంతరణ ఉండడంతో తగిన మోతాదులో ఇక్కడ మద్యం అందుబాటులో ఉండడం లేదు. అమ్మకాలపై స్లాబ్‌ పెట్టడంతో ప్రతి షాపుకు రోజుకు 100 కాటన్లకు మించి మందు ఇవ్వడం లేదు. మందు సరఫరా లేక పోవడంతో డిమాండ్‌ పెరిగింది. దీనికితోడు రాజకీయ పార్టీల నేతలు ముందే మద్యాన్ని దాచి పెట్టారన్న ప్రచారం కూడా ఉంది.  మద్యం సరఫరాలేక కొన్నిచోట్ల షాపులు మూసేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు  డంప్‌ చేయిస్తూ ఇతర పార్టీలకు లిక్కర్‌ దొరకకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తప్రతి ఏడాది 20శాతం సేల్స్‌ పెంచాలని అగ్రిమెంట్‌లో ఉంటుంది. దానికి అనుగుణంగా అమ్మకాలు పెంచేందుకు టార్గెట్స్‌ ఇస్తారు. అయితే ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో బెల్ట్‌ షాపులు మూయించారు. పాత లైసెన్సుల గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. డిసెంబర్‌ 1 నుంచి కొత్త లైసెన్స్‌ దారులు షాపులు తీసుకుంటారు. మద్యం లిప్ట్‌ చేసి అమ్ముడవకపోతే మిగిలిపోతుందనే ఉద్దేశంతో వైన్స్‌ షాప్స్‌ ఓనర్లు మద్యం లిప్ట్‌ చేసేందుకు ముందుకు రావడం లేదని ఎక్సైజ్‌ అధికారులు అంటున్నారు. అయితే తీసుకున్న స్టాక్‌లో ఎక్కువ మొత్తం ఎలక్షన్స్‌ కోసం తరలించారనే ప్రచారం జరుగుతోంది. నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, అచ్చంపేట పట్టణాలతో పాటు తెల్కపల్లి, బిజినేపల్లి, వ్టటెం, వెల్దండ వంటి ప్రాంతాల్లో ఈ కోటా ఒక్క పూటకు కూడా చాలదు.గ్రామాల జనాభా, ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామ స్థాయి నాయకులు తమకు ఇంత మందు ఇవ్వాలని ముందే టార్గెట్లు పెడుతున్నారు. ఇవ్వడానికి డబ్బులు, పోయడానికి మందు లేకపోతే ఇబ్బంది పడతామని దబాయిస్తున్నారు.