మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

అదిలాబాద్‌ : లక్ష్మణచాంద మండలంలో మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులు అస్వసత్థకు గురైన ఘటన నర్సాపూర్‌ డబ్ల్యూ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. భోజనం చేసిన వారిలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో బల్లి పడినట్లు నిర్వహకులు గుర్తించి విద్యార్థులను నిర్మల్‌ ఆసుపత్రికి తరలించారు.