మనుషులా.. పోలీసులా..!

తెలంగాణ షేర్నీ రహిమున్నాసాపై అమానవీయదాడి
పోరుబిడ్డ పరిస్థితి విషమం సిరిసిల్లలో విజయమ్మ మొసలి కన్నీరు దీక్షకు వ్యతిరేకంగా జై తెలంగాణ అని నినదిస్తున్న ఓ తెలంగాణ ముస్లిం ఆడ బిడ్డ పై విచక్షణ రహితంగా మప్టిలొ ఉన్న పోలీసుగా భావిస్తున్న ఓ వ్యక్తి అమానవీయంగా జీపు పై నుంచి కిందకు తోసెసాడు. సాధరణంగా మహిళలను అదుపు లోకి తీసుకోవాలంటే ఆడ పోలీసులు మాత్రమే అరెస్టు చేయాలి. అలాంటిది అతి దుర్మార్గంగా , కిరాతకంగా జైతెలంగాణ అనినినదిస్తున్న రహీమున్నీసాను వాహనం పై నుంచి క్రిందికి తోసెయ్యడంతో రహీమున్నిసాకు తీవ్ర గాయాలయ్యాయి. మనుషుల పట్ల ఏ శత్రు సైన్యం కూడా ఇలా వ్యవహరించదు. మనుషులం అన్న సంగతి మరచి కండ కావరాన్ని చూపిన ఈ ఖాకీని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. మానవహక్కుల సంఘం సుమోటోగా తీసుకోని ఈ అమానవీయ దాడికి కారణమైన కిరాతకుడ్ని కఠినంగా శిక్షించాలని టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు తుల ఉమా కోరారు. రహీమున్నీసా పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఆస్పత్రికి తరలించారు.