మన వైద్యం అంతంతమాత్రమే

మాతా శిశు మరణాలపై ప్రధాని ఆందోళన
చెన్నై: మన వైద్యం ఇంకా అధ్వాన్నంగానే ఉంది. వరుెసగా నెలకొంటున్న శిశు, గర్భినుల మరణాలు ఆందోళన రెకెత్తిస్తున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మూడింట రెండొంతుల డబ్బును ప్రజల తమ జేబు నుంచు ఖర్చు చేయాల్సివ వస్తొందని మన్మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో జరిగిన జవహర్‌లాల్‌ ఇనిస్టిట్యూట్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వైద్య విద్యా స్థాయి మరింత మెరుడు పడాల్సి ఉందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటనే జాతి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఆరోగ్యంగ పరంగా, ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ఏడేళ్ల క్రితం ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ మంచి సత్ఫలితాలు ఇచ్చిదన్నారు. మౌళిక సదుపాయాలకు పెంపునకు కృషి చేసిన గులాం నబీ ఆజాద్‌ను ప్రశంసించారు. వచ్చే ఐదేళ్ల వరకు జాతీయ గ్రామీణ మిషన్‌ కొనసాగించడానికి తమ ప్రభుత్వ నిర్ణయించిదన్నారు. నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ అనే సరికొత్త పథకంతో రూపొందింస్తున్నామని ఇది పట్టణాలు నగర ప్రజల కోసం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లు రెండూ పనిచేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే ఎకీకృత జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రారంభిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు కొరత ఉందని, దాని ప్రభావం ప్రజలపై చూపుతొందన్నారు. వెయ్యి మందికి ముగ్గురు డాక్టర్లు ఉండాల్సిండగా, ఇద్దరు డాక్టర్లుకు ముగ్గురు నర్సులున్నారని ఆజాద్‌ నేతత్వంలోని ఆరోగ్య శాఖ త్వరలోనే తగ్గిస్తుదన్నారు. ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ మార్పు చేస్తోందన్నారు. వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. గడిచిన మూడేళ్లలో యూజీ, పీజీ సీట్ల స్థాయిని పెంచామన్నారు. ప్రధాన మంత్రి స్వాస్‌, సురక్షా యోజనా పథకం కింద భోపాల్‌, భువనేశ్వర్‌, జోద్‌పూర్‌, పాట్నా లలో ఏఐఐఎంఎస్‌లను ఏర్పాటు చేస్తున్నాని తెలిపారు. 2014 విద్యా సంవత్సరం నుంచి పనిచేస్తాయని భావిస్తున్నామన్నారు. ప్రధాని జిప్మర్‌ సేవలను ప్రధాని ప్రశంసలతో ముంచెత్తారు. ఈసందర్భం గా 325 కోట్లతో నిర్మించన శిశువు మహిళల ఆస్పత్రిని ప్రారంభించారు. స్నాత్సకోత్సవంలో ప్రధానితో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎస్‌రంగస్వామి, కేంద్రమంత్రి వి. నారయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.